గందరగోళంలో గొత్తికోయలు

గందరగోళంలో గొత్తికోయలు
  •     దండకారణ్యంలో ‘ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ కగార్‌‌‌‌‌‌‌‌’
  •     తెలంగాణకు పెరుగుతున్న వలసలు
  •     తిరిగి పంపించేందుకు ఆఫీసర్ల ప్రయత్నాలు

భద్రాచలం, వెలుగు : తెలంగాణ– -ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ బార్డర్‌‌‌‌‌‌‌‌లోని గొత్తి కోయల జీవనం గందరగోళంలో పడింది. ‘ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ కగార్‌‌‌‌‌‌‌‌’ పేరుతో అబూజ్‌‌‌‌‌‌‌‌మడ్‌‌‌‌‌‌‌‌ పరిరక్షణకు కేంద్రం రంగంలోకి దిగడంలో వరుస ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులు, కేంద్ర బలగాల మధ్య జరుగుతున్న వార్‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో గత ఆరు నెలల్లోనే 141 మందికిపైగా మావోయిస్టులు ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో చనిపోయారు. ఇన్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ల పేరిట 10 మందిని మావోయిస్టులు చంపేశారు. 

మావోయిస్టుల హింస, భద్రతాబలగాల దూకుడు కారణంగా 20 ఏండ్ల తర్వాత మళ్లీ వలసలు షురూ అయ్యాయి. ఆరు నెలల్లోనే నాలుగు వేల మంది గొత్తికోయలు తెలంగాణకు వలస వచ్చారు. మరోవైపు మావోయిస్టులు అమర్చిన మందుపాతర్ల కారణంగా ఆదివాసీలు గాయాల పాలవుతున్నారు. 2005లో సల్వాజుడుం కారణంగా ప్రబలిన హింసతో దండకారణ్యం నుంచి గొత్తికోయలు తెలంగాణకు వచ్చి తలదాచుకుంటున్నారు. తాజాగా బస్తర్‌‌‌‌‌‌‌‌ ఏరియా నుంచి గొత్తికోయలు వస్తున్నట్లు తెలంగాణ అటవీశాఖ గుర్తించింది. కొందరు కూలీ పనుల కోసం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్తున్నారు. 

అటవీశాఖకు విషమ పరీక్ష

గొత్తికోయల వలసలు అటవీ శాఖకు పరీక్షగా మారాయి. తెలంగాణ అడవుల్లోకి వచ్చి పోడు సాగు పేరుతో ఇష్టారాజ్యంగా చెట్లను నరుకుతున్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం బెండాలపాడు గ్రామంలో 100 ఎకరాలు నరికిన ప్రాంతంలో 25 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకున్న క్రమంలోనే రేంజర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావును గొడ్డళ్లతో నరికి చంపారు. దీంతో అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ వలస ఆదివాసీలు మన ఎస్టీలు కాదంటూ అసెంబ్లీలో ప్రకటించింది. 

వారిని తిరిగి ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ దండకారణ్యంలోకి పంపించాలని నిర్ణయించింది. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ నుంచి కొందరు అటవీశాఖ అధికారులు ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లోని బస్తర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో ఉన్న దంతెవాడ, సుక్మా, బీజాపూర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పర్యటించారు. బస్తర్‌‌‌‌‌‌‌‌ సీసీఎఫ్​రాజేశ్‌‌‌‌‌‌‌‌ పాండేతో చర్చలు జరిపారు. రాయ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ కూడా వెళ్లి వలసల విషయం వివరించారు. వలస వచ్చిన గొత్తికోయలను బస్తర్‌‌‌‌‌‌‌‌కు తిరిగి తీసుకెళ్లాలని సూచించారు. 

రెండేళ్ల క్రితం కూడా సామాజిక కార్యకర్తలు సుభ్రంశు చౌదరి ఆధ్వర్యంలో 36 వేల మందిని తెలంగాణ రాష్ట్రం నుంచి ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. కాగా బీజాపూర్, సుక్మా, దంతెవాడ కలెక్టర్లు, బస్తర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ శ్యామ్‌‌‌‌‌‌‌‌ ధావ్‌‌‌‌‌‌‌‌డే వలస ఆదివాసీల తరలింపు, పునరావాసంపై ప్రస్తుతం ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ సర్కారు ఒక పాలసీని తీసుకొస్తుందని, ఫైనల్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌లో ఉందని తెలంగాణ నుంచి వెళ్లిన అటవీశాఖ అధికారులకు వివరించారు. 

హక్కులు కల్పించాలంటున్న ఆదివాసీలు

తెలంగాణలోని అడవుల్లో ఉంటున్న వలస ఆదివాసీలు మాత్రం తాము వివక్షకు గురవుతున్నామని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో గొత్తికోయలు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలోని ఐదో షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు పక్క రాష్ట్రాలకు వెళ్లినా ఆదివాసీలుగానే గుర్తించాలి. కానీ తెలంగాణలో తమను ఎస్టీలుగా గుర్తించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు, రేషన్, ఆధార్‌‌‌‌‌‌‌‌, ఓటర్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఉన్నా ఐటీడీఏ నుంచి ఎలాంటి సహకారం అందడం లేదంటున్నారు. తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న భద్రాద్రికొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాల్లో 1.25 లక్షల మంది ఆదీవాసీలు తలదాచుకుంటున్నారు. వీరి ఆధీనంలో 1,14,892 ఎకరాల పోడు భూమి ఉన్నట్లు అంచనా. వీరిని దండకారణ్యానికి తరలించాలని ఆఫీసర్లు చూస్తుంటే.. వీరు మాత్రం తమకు హక్కులు కల్పించాలంటూ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.