
గచ్చిబౌలి, వెలుగు: సోమాలియా దేశస్తుడి బ్రెయిన్లో ఇరుక్కున్న బుల్లెట్‌ను గచ్చిబౌలి కేర్ హాస్పిటల్డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. అరుదైన సర్జరీ చేయడంలో సక్సెస్అయ్యారు. సర్జరీ వివరాలను కేర్ హాస్పిటల్ న్యూరో సర్జన్ డా.లక్ష్మీనాథ్శివరాజు గురువారం మీడియాకు వెల్లడించారు. సోమాలియాలో జరుగుతున్న సివిలియన్వార్లో రెండు నెలల కింద గులెమ్మహమ్మద్హెర్సీ(26) అనే యువకుడి బ్రెయిన్‌లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తలలో వెనుక వైపు ఇరుక్కుపోయింది. తర్వాత హెర్సీ కాళ్లు, చేతులు పడిపోయి కోమాలోకి వెళ్లాడు. స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అక్కడి డాక్టర్లు బుల్లెట్ తీయడంలో విఫలమయ్యారు. కుటుంబ సభ్యులు హెర్సీని సిటీకి తీసుకొచ్చి గచ్చిబౌలిలోని కేర్ఆసుపత్రిలో అడ్మిట్‌చేశారు.
డా.లక్ష్మీనాథ్ శివరాజు బృందం పరీక్షించి చిన్న మెదడుకు సమీపంలోని సున్నితమైన ప్రాంతంలో బుల్లెట్ ఇరుక్కున్నట్లు గుర్తించింది. న్యూరో నావిగేషన్, సర్జికల్మైక్రోస్కోప్ ద్వారా 12 గంటల పాటు ఆపరేషన్నిర్వహించి బుల్లెట్‌ను విజయవంతంగా బయటకు తీసింది. ప్రస్తుతం యువకుడు కోలుకుంటున్నాడని, పూర్తిగా కోలుకోవడానికి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉందని డా.లక్మీనాథ్ శివరాజు తెలిపారు. బుల్లెట్3సెం.మీ పొడవు, వెడల్పు ఉందని తెలిపారు. హాస్పిటల్ సీఓఓ నిలేశ్, వైద్య బృందం పాల్గొన్నారు.