ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ కూడా ఒక భాగమైంది. ఈ స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి కొందరు ఆటలాడితే.. కొందరు సినిమాకు వెళతారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమకు నచ్చిన మార్గాల్ని ఆశ్రయిస్తారు. అయితే, ఈ మధ్య స్ట్రెస్ నుంచి రిలీఫ్ నిచ్చే పరికరాలు కూడా చాలానే మార్కెట్లోకి వచ్చిపడ్డాయి. ఆన్లైన్ షాపింగ్ లో వీటికి బాగా క్రేజ్ ఉంది.
సైస్ బాల్: కండరాల్లో పేరుకున్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు స్ట్రెస్ బాల్ ని పట్టుకొని చేతితో ప్రెస్ చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫిడ్జెట్ స్పిన్నర్ చాలామంది చేతుల్లో ఏదో ఒకటి కదిలిస్తూ.. రిలాక్స్ అవుతుంటారు. దీనికోసం కొంతమంది వేలికి ఉన్న ఉంగరం తిప్పితే... కొంతమంది వేళ్ల మధ్య పెన్నుని ఆడించడం లాంటివి చేస్తుంటారు. దీన్నే 'ఫిడ్జెటింగ్' అంటారు. దీని ఆధారంగా ఫిడ్జెట్ స్పిన్నర్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇది వేళ్ల మధ్య తిప్పితే ఒత్తిడి మాయమవుతుందని చాలామంది నమ్ముతున్నారు. చిన్నఫ్యాన్మాదిరిగా ఉండి. మధ్యలో బేరింగ్స్ ఉండే ఈ స్పిన్నర్స్ను చాలామందే వాడుతున్నారు.
ఫిడ్జెట్ క్యూబ్: ఫిడ్జెట్ స్పిన్నర్ అంత కాకపోయినా, ఈ మధ్య కాలంలో ఫిడ్జెట్ క్యూబ్ కూడా బాగానే ప్రచారంలోకి వచ్చింది. ఒక క్యూటీ కి ఆరు వైపులా ఉండే రకరకాల వస్తువులను నొక్కడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చట. స్విచ్లు, బటన్లు, జారుస్టిక్... ఇలా ఎలక్ట్రానిక్ పరికరాల మీద ఉండే రకరకాల టెక్నిక్స్ ఈ క్యూబ్ మీద ఉంటాయి.
వర్రీ స్టోన్స్: కొంతమంది ఒత్తిడిని ఎదుర్కోవడానికి గోళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇక పెదాలు కొరుక్కోవడం, పెన్నుని నమలడం, జుట్టు పీక్కోవడం లాంటి అలవాట్లు కూడా ఇలాంటివే. ఇలాంటి అలవాట్ల నుంచి ధ్యాసను వర్రీ స్టోన్స్ మళ్లీస్తాయి. అరచేతిలో ఒక రాయిని ఆడిస్తూ ఉండటం వల్ల, ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు.