మైండుకు ఎప్పుడు ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. దాంతో ఆలోచనలు ఎక్కువవుతుంటాయి. అయితే ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఆలోచిస్తున్నప్పుడు ఏమాత్రం ఏకాగ్రత కుదరదు. ఆలోచనలు కూడా రావు. మెదడు సరిగ్గా పనిచేస్తే ఆలోచనా పనితీరు, విశ్లేషణా సామర్థ్యం బాగా పెరుగుతాయి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే ముఖ్యంగా తగినంత నిద్ర అవసరం. రోజుకు 6 గంటల గాఢంగా నిద్రపోయే వారిలో మెదడు పనితీరు బాగుంటుంది. రోజుకు 6 గంటల నుంచి 8 గంటలు నిద్ర పోవాలి.
ప్రతిరోజూ అరగంట లేదా గంట పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసేవారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని తెలిపారు అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు. వ్యాయామం వల్ల గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. శారీరకంగా ఫిట్ గా ఉంటే ఆరోగ్యం కూడా ఫిట్ గా ఉంటుంది. వ్యాయామం వల్ల డిప్రెషన్ కు కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి మెదడుపై ఒత్తిడి తగ్గుతుందని తెలుపుతున్నారు.
ALSO READ : శరీరంలో రక్తం పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి
ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తగినన్ని ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. ఖాళీ సమయాల్లో మెదడుకు పదును పెట్టండి. అంటే ఫజిల్స్ లాంటివి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. దీని వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టారు.