నైజీరియా హాస్పిటల్​తో చేతులు కలిపిన లైఫ్​స్పాన్

నైజీరియా హాస్పిటల్​తో చేతులు కలిపిన లైఫ్​స్పాన్

హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన లైఫ్‌‌స్పాన్ హాస్పిటల్స్... నైజీరియాకు చెందిన రైమా ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్​తో చేతులు కలిపింది.  లైఫ్‌‌స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ నరేంద్ర రామ్ మాట్లాడుతూ నైజీరియన్లకు తమ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందిస్తామని అన్నారు.  ఆ దేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులతో కూడిన ఆరోగ్య సంరక్షణ  సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. కార్యక్రమంలో భారత్​లో నైజీరియా రాయబారి పాల్గొన్నారు.