హైదరాబాద్, వెలుగు : లైఫ్‌స్టైల్ బ్రాండ్ బీయింగ్ హ్యూమన్ అన్ని క్లాతింగ్ కలెక్షన్లపై 50శాతం తగ్గింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. అంతేగాక 4 కొత్త పర్ఫ్యూమ్లను మార్కెట్లోకి తెచ్చింది. పండుగల సమయంలో కానుకగా ఇవ్వడానికి ఇవి అనువుగా ఉంటాయని, ఈ నెల 27 వరకు ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది.
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆఫర్లు ఇస్తున్నామని, ప్రత్యేక కలెక్షన్‌ను కూడా అందుబాటులో ఉంచామని పేర్కొంది. మంధాన ఇండస్ట్రీస్‌తో కలసి సల్మాన్ఖాన్ఫౌండేషన్ బీయింగ్ హ్యూమన్ పేరుతో ప్రొడక్టులను అమ్ముతోంది. ఈ బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా 500 రిటైల్స్టోర్లు ఉన్నాయి.