హైదరాబాద్, వెలుగు: ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ దక్కింది. 50 ఏండ్లుగా పర్యావరణ పరిరక్షణకు, సమాజం కోసం ఆయన చేస్తున్న కృషికిగానూ క్యాపిట్ ఫౌండేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ అవార్డును ప్రకటించింది.
ఆదివారం ఢిల్లీలో సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి ఆర్. కె. పట్నాయక్ చేతుల మీదుగా పురుషోత్తంరెడ్డి ఈ అవార్డును అందుకోనున్నట్లు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రెసిడెంట్ కె. లీలా లక్ష్మారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తన సేవలను గుర్తింపుగా ఈ అవార్డు రావడంపై పురుషోత్తం రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.