
- ముగ్గురికి గాయాలు..ఒకరి కాలు విరిగింది
- నాంపల్లి మురాద్‌నగర్‌లో ఘటన
మెహిదీపట్నం, వెలుగు: నాంపల్లి నియోజకవర్గం మురాద్ నగర్ లోని ఓ బిల్డింగ్‌లో లిఫ్ట్కుప్పకూలింది. ఒక్కసారిగా ఫోర్త్ఫ్లోర్నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. చోటి మసీద్సమీపంలోని నాకో షమ్స్ అపార్టుమెంట్ఫోర్త్ఫ్లోర్ లో ఉంటున్న మక్సుద్ ఇంటికి ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో లంగర్ హౌస్ లో ఉండే బంధువులైన సయ్యద్ నసీరుద్దీన్(40), సబీనా బేగం(35), మైమూనా బేగం(30), ముగ్గురు పిల్లలు వచ్చారు. ఫోర్త్‌ఫ్లోర్‌కు వెళ్లేందుకు అక్కడి లిఫ్ట్ఎక్కారు. అయితే ఫోర్త్ఫ్లోర్దాకా వెళ్లిన లిఫ్ట్.. ఒక్కసారిగా కిందికి పడిపోయి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆగింది. లిఫ్ట్‌లోని సయ్యద్ నసీరుద్దీన్, సబీనాబేగంకు స్వల్ప గాయాలయ్యాయి.
మైమునా బేగం కాలు విరిగింది. స్థానికులు వారిని హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాజీద్హుస్సేన్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. లిఫ్ట్ప్రతిసారి రిపేర్ అవుతోందని, గతంలో కూడా లిఫ్టు మధ్యలో ఇరుక్కుపోయిందని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. లిఫ్ట్ రిపేర్‌లో ఉన్నట్లు తెలియక నసీరుద్దీన్, కుటుంబ సభ్యులు ఎక్కారని, లిఫ్ట్వద్ద ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. నాంపల్లి నియోజకవర్గంలో వరుసగా లిఫ్టు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల కింద లిఫ్ట్‌మధ్యలో బాలుడు ఇరుక్కుపోయి చనిపోయాడు.