![కొల్లూరు, బోరంపల్లి ఎత్తిపోతల పథకం మోటర్లు, పైపులు చోరీ](https://static.v6velugu.com/uploads/2025/02/lift-irrigation-scheme-motors-pipes-stolen_oenCAtqV3w.jpg)
కోటపల్లి, వెలుగు : కొల్లూరు, బోరంపల్లి ఎత్తిపోతల పథకంలోని కోట్ల విలువచేసే మోటర్లు, పైపులు దొంగల పాలవుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, ఐఆర్సీపీ నేత జయరావ్ మండిపడ్డారు. మండలంలోని కొల్లూరు, బోరంపల్లి గ్రామాలలో గురువారం పర్యటించి రైతులతో మాట్లాడారు. 2009లో 1,745 ఎకరాలకు నీరు అందించాలనే లక్ష్యంతో కొల్లూరు, బోరంపల్లి ఎత్తిపోతల పథకం ప్రారంభించారని తెలిపారు.
కానీ కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురికావడంతో రైతులు పంటలు పండించుకునే వీలు లేకుండా పోయిందనిఇదే అదునుగా దొంగలు పథకంలో వచ్చిన మోటార్లు, పైపులు, ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేస్తున్నా రని పేర్కొన్నారు. కోట్ల విలువచేసే సామగ్రి దొంగలపాలవుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏమీ పట్టనట్లుగా ఉంటున్నా రని మండిపడ్డారు. జోక్యం తీసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు నగేశ్, చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.