బెంగళూరు: కర్నాటకలోని మైసూరులో ఓ కాలేజీ హైకోర్టు ఉత్తర్వులను బ్రేక్‌చేస్తూ.. హిజాబ్‌తో వచ్చిన స్టూడెంట్లను క్లాస్‌రూమ్‌లోకి అనుమతించింది. యూనిఫామ్రూల్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. రాష్ట్రంలో కొన్ని రోజులుగా హిజాబ్గొడవ కొనసాగుతోంది. ఈ గొడవ కోర్టుకు వెళ్లడంతో హిజాబ్, కండువాలతో క్లాసులకు అటెండ్ కావ డంపై హైకోర్టు స్టే విధించింది. తుది తీర్పు ఇచ్చేదాకా యూనిఫామ్‌తో మాత్రమే అటెండ్ కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కాలేజీల మేనేజ్మెంట్లు హిజాబ్సహా మతపరమైన దస్తులతో వచ్చే వారిని క్లాసుల్లోకి రానివ్వడంలేదు. ఇటీవల తుమకూరు జిల్లాలోని ఓ కాలేజీలో 144 సెక్షన్ఆంక్షలు బ్రేక్‌చేస్తూ.. హిజాబ్‌తో క్లాసురూముల్లోకి అనుమతించాలని స్టూడెంట్ల్ఆందోళన చేయగా.. దాదాపు 20 మంది ముస్లిం అమ్మాయిలపై కేసు నమోదైంది. ఈ క్రమంలో మైసూరులోని ఓ ప్రైవేటు కాలేజీ యూనిఫామ్రూల్ను రద్దు చేసి, హిజాబ్‌తో వచ్చిన స్టూడెంట్లను క్లాసు రూమ్ లోకి అనుమతించింది. ‘‘హిజాబ్‌తో వచ్చారని నలుగురు స్టూడెంట్లను క్లాసులోకి రానివ్వలేదు. వారు నిరసన తెలుపగా.. కొన్ని సంఘాలు వారికి మద్దతునిచ్చాయి. నేను కాలేజీకి వెళ్లి అందరితో చర్చించాను. ఇంతలో.. విద్యార్థులను హిజాబ్‌తో తరగతులకు అనుమతించడంతోపాటు, యూనిఫాం రూల్ ను రద్దు చేస్తున్నట్లు కాలేజీ ప్రకటించింది” అని మైసూరు ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్(డీడీపీయూ) డీకే శ్రీనివాస మూర్తి తెలిపారు. ఒకవైపు కోర్టులో విచారణ నడుస్తుండగానే ఓ ప్రైవేటు కాలేజీ యూనిఫామ్రద్దు నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలోని గడగ్, చిక్కమగళూరు, శివమొగ్గ, ఉడిపి సహా చాలా ప్రాంతాల్లో ఇంకా హిజాబ్ నిరసనలు
కొనసాగుతూనే ఉన్నాయి.