శ్రీశైలం డ్యాం 5గేట్లు ఎత్తివేత.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ

నల్లగొండ: నాగార్జున సాగర్ కు జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో సాగర్ డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

గార్జున సాగర్ కు  లక్షా 55వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 517.20 అడుగులకు చేరింది. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 144.2194 టీఎంసీలకు చేరింది. నాగార్జున సాగర్ డ్యాం నుంచి 6వేల 744  క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.