సింగూరు ఆయకట్టుకు ఢోకా లేదు: మంత్రి దామోదర రాజనర్సింహ

సింగూరు ఆయకట్టుకు ఢోకా లేదు: మంత్రి దామోదర రాజనర్సింహ

పుల్కల్, వెలుగు: సింగూరు ప్రాజెక్ట్‌‌ పూర్తిగా నిండడంతో ఆయకట్టు రైతులకు ఢోకా లేదని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ప్రాజెక్ట్‌‌ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గురువారం రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ముందుగా కలెక్టర్‌‌ క్రాంతి వల్లూరితో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాజెక్ట్‌‌కు వస్తున్న వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు దిగువన, మంజీరా నది పరివాహకంలో ఉన్న ప్రజలు అలర్ట్‌‌గా ఉండాలన్నారు. 

అనంతరం ప్రాజెక్ట్‌‌ సమీపంలోని టూరిజం పార్క్‌‌ను మంత్రి సందర్శించారు. పార్కులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్‌‌ హాస్టల్‌‌ను పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఆఫీసర్లు కె. ధర్మ, భీమ్‌‌, నాగరాజు, ఆర్డీవో పాండు, నాయకులు దుర్గారెడ్డి, నత్తి దశరథ్‌‌, తలారి అంజయ్య పాల్గొన్నారు.