' లైగర్ ' ఖతర్నాక్ క్రాస్ బ్రీడ్..

' లైగర్ ' ఖతర్నాక్ క్రాస్ బ్రీడ్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ..డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..ఈ కాంబోలో మూవీ అంటే..మామూలుగా ఉండదు. అదీ ఓ పాన్ ఇండియా మూవీ అంటే ఫ్యాన్స్కు పండగే. అలాంటి ఈ సూపర్ కాంబోలో వస్తున్న మూవీ లైగర్. సినిమా మొదలైనప్పటి నుంచి ఈ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ లుక్స్..సాంగ్స్ లైగర్పై ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ను పెంచేశాయి. తాజాగా లైగర్ ట్రైలర్ రిలీజైంది. సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ట్రైలర్ను విడుదల చేశారు. 


నిక్కరేసిన దగ్గర నుంచి నేను పెద్ద ఫైటర్...బొక్కలిరగదీయడంలో నెనెప్పుడు టాపర్ అంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. వాడు వీడు ఎవ్వడైనా లేనే లేదు ఖాతర్..అందుకే అందరు అంటుంటారు నన్ను లైగర్ అంటూ ఫ్యాన్స్కు సూపర్ కిక్ ఇచ్చాడు. ఒక లయన్కు ..టైగర్కు పుట్టిన క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ అంటూ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ తో  ట్రైలర్ మొదలవుతుంది. గల్లీలో తిరిగే ఓ సాధారణ కుర్రాడు..ఇంటర్నేషనల్ బాక్సర్ ఎలా అయ్యాడనేది స్టోరీ. ముఖ్యంగా  ట్రైలర్ లో విజయ్  దేవరకొండ యాక్షన్ సీన్స్ కేక పుట్టిస్తున్నాయి. రమ్యకృష్ణ  కారెక్టర్ ఊర మాస్గా ఉందని చెప్పాలి. చివ‌ర్లో మైక్ టైస‌న్ ఎంట్రీ చూస్తే విజిల్స్ వేయాల్సిందే.  ‘ఐ యామ్ ఏ ఫైట‌ర్‌ అని  విజ‌య్ న‌త్తి న‌త్తిగా చెప్పే డైలాగ్ విన్న టైసన్.......మ‌రి నేనెవ‌ర్నీ  అంటూ  కౌబోయ్ గెట‌ప్‌లో ఎంట్రీ ఇస్తాడు. ఇది ట్రైలర్ లో నెక్ట్స్ లెవల్ .  మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీలో యాక్షన్ కు కొదవలేదనిపిస్తుంది.  విజ‌య్ సినిమా అంటే ఫ్యాన్స్ ఏ మేరకు ఎక్స్ పెక్ట్ చేస్తారో అవన్నీ ఇందులో ఉండనున్నాయని తెలుస్తోంది. 

  
విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా  ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ లైగర్ ను  నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.