పొలానికి నీళ్లు పెడుతుండగా పిడుగు పడి రైతు మృతి 

పొలానికి నీళ్లు పెడుతుండగా పిడుగు పడి రైతు మృతి 

మంథని, వెలుగు : పెద్దపల్లి జిల్లా మంథని మండలం  కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని పందులపల్లిలో పిడుగుపడి ఓ రైతు చనిపోయాడు. గ్రామానికి చెందిన ఉడుత నారాయణ(58) సోమవారం రాత్రి తన పొలానికి నీళ్లు పెడుతుండగా వర్షం స్టార్టయ్యింది.

కొద్దిసేపటికే ఉరుములు, మెరుపులతో అతడిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌‌‌‌ఐ రమేశ్ తెలిపారు.