
పెద్దశంకరంపేట, వెలుగు : పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం పిడుగుపడి తాతామనవళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనాస్థలిని సోమవారం సివిల్సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ, డీఎస్ఓ బ్రహ్మ రావు, డీఎస్ఓ కరుణ, డీఏఓ గోవింద్ పరిశీలించారు. సంఘటన ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు.