తాటిచెట్టుపై పిడుగుపాటు

కరీంనగర్ జిల్లాలో తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. హుజూరాబాద్ శివారులో వర్షం కురుస్తున్న సమయంలో తాటిచెట్టుపై పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా తాటి చెట్టుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే స్థానికులు పిడుగు పాటు దృశ్యాన్ని ఫోన్లలో రికార్డు చేశారు. 
    
మరికొన్నిచోట్ల భారీ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు చెట్లు నెలకొరిగాయి. కేబుల్ వైర్లు తెగిపోయాయి. గాలి దుమారంతో కూడిన వర్షానికి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.