ఎన్నికల్లో అక్క పోటీ చేస్తోందని సోనూ కీలక నిర్ణయం

కరోనా సమయంలో వేలమందిని ఆదుకొని అందరి మన్ననలు అందుకున్నాడు నటుడు సోనూసూద్. సోషల్ మీడియాలో సోనూసూద్ కు ఉన్న ఫాలోయింగ్ చూసి.. ఆయనను పంజాబ్ ఎన్నికల ప్రచారకర్తగా ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏడాది క్రితం నియమించింది. అయితే ప్రస్తుతం ఈ నియామకాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా పంజాబ్ ప్రధాన ఎన్నికల అధికారి కరుణరాజు శుక్రవారం వెల్లడించారు. కాగా.. ఈ విషయంపై సోనూసూద్ స్పందించారు. ఎన్నికల సంఘం, తాను కలిసే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. తన సొదరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో తానే స్వచ్ఛందంగా ఎన్నికల సంఘం ప్రచారకర్త బాధ్యతల నుంచి వైదొలగినట్లు సోనూసూద్‌ తెలిపారు.

For More News..

రాఘవపై మరో 12 కేసులున్నాయ్

సమాధిలో మహిళ కాళ్లు, చేతులు, పుర్రె మాయం..