కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ వైస్ ఎంపీపీగా లిక్కి గురువమ్మ ఎన్నికయ్యారు. బుధవారం మండల పరిషత్ ఆఫీస్‌లో ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆర్డీవో ఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. మొత్తం 11 మంది ఎంపీటీసీలకు ఇద్దరు చనిపోగా... ఆరుగురు హాజరయ్యారు. మరో ముగ్గురు గైర్హాజరు అయ్యారు.
వైస్ ఎంపీపీగా తొగర్రాయి ఎంపీటీసీ లిక్కి గురువమ్మ ఒక్కరే నామినేషన్ వేయగా.. ఆరుగురు ఎంపీటీసీలు చేతులెత్తి మద్దతు తెలిపారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో ప్రకటించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాన్ని అందజేశారు. ఎంపీపీ మల్లెల రాణి , ఎంపీడీవో రామచంద్రరావు, జడ్పీటీసీ కృష్ణకుమారి పాల్గొన్నారు.