ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రమోషన్లకు లైన్ క్లియర్

  • .జోన్ 5, జోన్ 6 కేసు కొట్టేసిన హైకోర్టు
  • 306 మంది అధికారులకు త్వరలోనే ప్రమోషన్లు
  • 200 డీఈఈ, 50 ఈఈ, 35 ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ, 18 సీఈ ప్రమోషన్లు.. మరో ముగ్గురికి ఈఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలుగా చాన్స్!

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రమోషన్లకు లైన్ క్లియర్ అయ్యింది. జోన్ 5, జోన్ 6 వివాదానికి సంబంధించిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం హైకోర్టు కొట్టేసింది‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈ నేపథ్యంపలోనే శాఖలో దశాబ్దాలుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రమోషన్లకు మోక్షం కలిగింది. అధికారుల ప్రమోషన్లకు సంబంధించి ఇటీవలే సర్కారు ఫైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోపు ప్రమోషన్లను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు కూడా కేసు కొట్టేయడంతో 306 మంది అధికారులకు ప్రమోషన్లు దక్కనున్నాయి.

ఏఈఈ నుంచి డీఈఈలుగా 200 మంది, డీఈఈ నుంచి ఈఈలుగా 50 మంది, ఈఈ నుంచి ఎస్ఈలుగా 35 మంది, ఎస్ఈ నుంచి సీఈలుగా 18మంది, సీఈ నుంచి ఈఎన్సీలుగా ముగ్గురికి ప్రమోషన్లు రానున్నాయి. న్యాయపరమైన అడ్డంకులు తొలగడం పట్ల హైదరాబాద్ ఇంజినీర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ప్రమోషన్లు వెంటనే కల్పిస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారని శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

ఏండ్లుగా అడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాక్ ప్రమోషన్లే

ఏండ్ల తరబడి శాఖలో అడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాక్ పోస్టింగులనే గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ అమలు చేసింది. ఈఈలుగా ఉన్నవారిని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలుగా.. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలుగా ఉన్నవారిని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ సీఈలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రమోషన్ల గురించి అడిగితే హైకోర్టు కేసును సాకుగా చూపించిన గత సర్కారు.. ఆ కేసుని క్లియర్ చేయించడంలో చొరవ తీసుకోలేదన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి న్యాయ సమస్యలు తొలగేలా కృషి చేసింది. ఇకపై డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జులు, అడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాక్ ప్రమోషన్లు ఉండవని, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్షన్లు అసలు ఇవ్వబోమని ఇప్పటికే ఉత్తమ్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.