లండన్: ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇండియా వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. బుధవారం అతనికి ఇండియా వీసా లభించిందని ఇంగ్లండ్ బోర్డు తెలిపింది. ఈ వారాంతంలో అతను జట్టుతో కలుస్తాడని వెల్లడించింది. బషీర్ తల్లిదండ్రులు పాక్ సంతతి వాళ్లు కావడంతో నిర్ణీత సమయంలో అతని వీసా క్లియర్ అవ్వలేదు.
దాంతో అతను అబుదాబీలో క్యాంప్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌తో పాటు ఇండియా రాలేకపోయాడు. అబుదాబీ నుంచి తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. దీనిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. యూకే ప్రభుత్వం కూడా కల్పించుకొని తమ దేశ పౌరుల వీసాల విషయంలో న్యాయంగా వ్యవహరించాలని ఇండియాకు సూచించింది.