అధిక విస్తీర్ణం, ఖండానికి ఉండాల్సిన భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యతలను కలిగి ఉండటం వల్ల భారత్‌ను ఉపఖండం అని పిలుస్తారు. ఈ ఉపఖండంలోకి భారత్‌తోపాటు పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు వస్తాయి. భారత్ 32,87,263 చ.కి.మీల విస్తీర్ణంతో ప్రపంచ ఖండ భూభాగ విస్తీర్ణంలో 2.4 శాతం, ఉపరితల విస్తీర్ణంలో 0.56 శాతం ఆక్రమిస్తున్నది.
ప్రపంచంలో వైశాల్యపరంగా రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా తర్వాత భారత్ ఏడో స్థానంలో ఉన్నది. సరిహద్దున ఉన్న ఏడు దేశాలతో 15,106.7 కి.మీ.ల పొడవైన భూ సరిహద్దును భారత్ కలిగి ఉన్నది. ఈ సరిహద్దును16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు పంచుకుంటున్నాయి.
భూ సరిహద్దు వివాదాలు
భారత్ VS పాకిస్తాన్
1947, అక్టోబర్ 22న కశ్మీర్ గిరిజనులు పాకిస్తాన్ సైన్యంతో కలిసి కశ్మీర్ ముట్టడికి ప్రయత్నించారు. దీనిని ఎదుర్కోవడం కోసం అక్టోబర్ 26న మహారాజా హరిసింగ్ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తూ సంతకాలు చేశారు. 1948లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో కశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లేదా ఆజాద్ కశ్మీర్, కశ్మీర్‌గా విడిపోయింది. పీఓకే, కశ్మీర్ మధ్య ఉన్న సరిహద్దునే సీజ్ ఫైర్ లైన్ అని, ఆ తర్వాత జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దును లైన్ ఆఫ్ కంట్రోల్‌గా మార్చారు.
జమ్మూకశ్మీర్, లఢఖ్‌లో సరిహద్దు రేఖలు
లఢఖ్‌లో వివాదాస్పద ప్రాంతం సియాచిన్. సవాయి నుంచి మాధవ్‌పూర్ వరకు అంతర్జాతీయ సరిహద్దు రేఖ అని, మాధవ్‌పూర్ నుంచి ఎన్జే 9842 వరకు లైన్ ఆఫ్ కంట్రోల్ అని, ఎన్జే 9842 నుంచి ఇందిరాకాల్ వరకు యాక్చవల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అని పిలుస్తున్నారు.
రాడ్‌క్లిఫ్ అవార్డ్
రాడ్‌క్లిఫ్ అవార్డ్ ప్రకారం సర్ రాడ్‌క్లిఫ్ 1947లో భారతదేశాన్ని మూడు భాగాలుగా విభజించారు.
1. భారత్, 2. పశ్చిమ పాకిస్తాన్, 3. తూర్పు పాకిస్తాన్(ప్రస్తుతం బంగ్లాదేశ్). ఈ రాడ్‌క్లిఫ్ రేఖ ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్నది.
సర్ క్రిక్ వివాదం
ఈ వివాదం భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్నది. ఇక్కడ పాకిస్తాన్ గీసిన 24 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని భారత్ గుర్తించడం లేదు.
రాణా ఆఫ్ కచ్
ఇది భారత్, పాకిస్తాన్ల మధ్య ఉన్నది.
భారత్ VS ఆప్గనిస్తాన్
భారత్, ఆప్గనిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖను డ్యూరాండ్ రేఖ అంటారు. ఈ రేఖ స్వాతంత్ర్యానికి పూర్వం భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌కు ఉమ్మడి సరిహద్దుగా ఉండేది. ప్రస్తుతం డ్యూరాండ్ రేఖ భారత్, పాకిస్తాన్, భారత్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉన్నది.
జల సరిహద్దులు
భారత్‌కు 6,100 కి.మీ.ల ప్రధాన భూభాగ తీర రేఖ ఉంది. దీవులతో కలిపి తీరరేఖ పొడవు 7,516 కి.మీ. తొమ్మిది రాష్ట్రాలు, రెండు కేంద్ర
పాలిత ప్రాంతాలు తీర రేఖ కలిగి ఉన్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతాలు
- డయ్యుడామన్
- పుదుచ్చేరి (యానాం)
దేశం ప్రాదేశిక జలాల పరిధి 12 నాటికల్ మైళ్లు (ఒక నాటికల్ మైలు = 1.852 కి.మీ.) ఈ పరిధిలోకి ప్రవేశించాలంటే ఏ విదేశీ నౌకైనా తప్పనిసరిగా భారత్ అనుమతి తీసుకోవాలి. వ్యాపారపరంగా భారత్ జలాల పరిధి 200 నాటికల్ మైళ్లు. ఈ ప్రాంతంలో దొరికే వనరులన్నీ భారత్‌కే చెందుతాయి. ఈ జలాల పరిధి 2.02 మిలియన్ చ.కి.మీ. వరకు ఉన్నది.
భారత్– శ్రీలంక
భారత్, శ్రీలంక మధ్య ఆడమ్స్ బ్రిడ్జ్, పాంబన్ దీవి, పాక్ జలసంధి, మన్నార్ సింధుశాఖ ఉన్నాయి.
ఆడమ్స్ బ్రిడ్జ్: తమిళనాడుకు దక్షిణాన పాంబన్ దీవిలోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు విస్తరించి ఉన్నది. దీని పొడవు 32 కి.మీ.
పాక్ జలసంధి: ఆడమ్స్ బ్రిడ్జికి ఉత్తరాన పాక్ అగాధం, పాక్ జలసంధి ఉన్నాయి. ఈ పాక్ జలసంధి భారత్‌లోని పాయింట్ కొడిక్కిరామ్ నుంచి శ్రీలంకలోని పీడ్మౌంట్ వరకు ఉన్నది.
మన్నార్ సింధూశాఖ: ఆడమ్స్ బ్రిడ్జ్‌కు దక్షిణాన మన్నార్ సింధూశాఖ ఉన్నది. ఈ సింధూశాఖ భారత్‌లోని నాగర్‌కోయల్(తమిళనాడు) నుంచి శ్రీలంకలోని మన్నార్ వరకు విస్తరించి ఉన్నది. 1974లో జరిగిన ఒప్పందం ప్రకారం కచ్చటపు దీవులను భారత్, శ్రీలంకకు ఇచ్చింది.
- భారత్– మాల్దీవులు
- భారత్‌కు మాల్దీవులకు మధ్య 8 డిగ్రీల ఛానల్ ఉన్నది.
- భారత్ – ఇండోనేషియా
- భారత్‌లోని గ్రేట్ నికోబార్ దీవికి, ఇండోనేషియాలోని సుమత్రా దీవికి మధ్య గ్రేట్ ఛానల్ ఉంది.
- భారత్–థాయ్‌లాండ్
- భారతదేశానికి థాయ్‌లాండ్‌కు మధ్య అండమాన్ సముద్రం ఉన్నది.
- భారత్ – మయన్మార్
- భారత్‌కు, మయన్మార్‌కు మధ్య కోకోఛానల్ ఉన్నది.
- భారత్– బంగ్లాదేశ్
- భారత్‌కు బంగ్లాదేశ్‌కు మధ్య గల న్యూమూర్ దీవి ఉన్నది. తీన్బిఘా అనే ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌కు 999 సంవత్సరాలకు లీజు ఇచ్చింది.
భారత్ VS చైనా
భారత్, చైనాల మధ్య మూడు వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి.
పశ్చిమ సెక్టార్: భారత్‌లోని లఢఖ్‌కు, చైనాలోని సికియాంగ్ ప్రావిన్స్‌కు మధ్య పశ్చిమ సెక్టార్ ఉన్నది. ఇక్కడ భారత భూభాగం ఆక్సాయ్‌చిన్‌ను చైనా ఆక్రమించుకున్నది. ఇక్కడి సరిహద్దు రేఖను లైన్ ఆఫ్ యాక్చివల్ కంట్రోల్(ఎల్‌ఓఏసీ) అంటారు.
మధ్య సెక్టార్: చైనాకు చెందిన టిబెట్‌కు, భారత్‌లోని ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ సెక్టార్ ఉన్నది.
తూర్పు సెక్టార్: చైనాలోని టిబెట్ ప్రావిన్స్‌కు భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌కు మధ్య తూర్పు సెక్టార్ ఉన్నది. ఇక్కడ భారత భూభాగం సమత్జంగ్ను చైనా ఆక్రమించుకున్నది. ఈ ప్రదేశంలో 1914లో మెక్‌మోహన్ రేఖను గీశారు.
సరిహద్దును పంచుకుంటున్న ఏడు దేశాల అవరోహణ క్రమం
- బంగ్లాదేశ్ (26.5 శాతం) 4096.7 కి.మీ.
- చైనా (25.55 శాతం) 3488 కి.మీ.
- పాకిస్తాన్ (21.78 శాతం) 3323 కి.మీ.
- నేపాల్ (11.53 శాతం) 1751 కి.మీ.
- మయన్మార్ (9.89శాతం) 1643 కి.మీ.
- భూటాన్ (3.86శాతం) 699 కి.మీ.
- ఆఫ్గనిస్తాన్ (0.52శాతం) 106 కి.మీ.