
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్)1553 జూనియర్ లైన్‌మెన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1601 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ లైన్‌మ్యాన్: ఇందులో మొత్తం1553 పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్‌మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.
అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 48 పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. లైన్‌మెన్‌కు రూ.24340- రూ.39405. అసిస్టెంట్ ఇంజినీర్‌కు రూ.64295- రూ.99345 జీతం చెల్లిస్తారు.
సెలెక్షన్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్‌మెన్ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.tssouthernpower.com వెబ్సైట్ సంప్రదించాలి.