చేర్యాల, వెలుగు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గట్టి ప్రయత్నం చేస్తే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఎప్పుడో వచ్చేదని చేర్యాల మాజీ ఎమ్మెల్యే లింగయ్య అన్నారు. బుధవారం చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై చేస్తున్న దీక్షలు17వ రోజుకు చేరాయి.
ALSO READ: మనోహరాబాద్ వైన్స్లో చోరీ.. రూ. 80 వేల మద్యం బాటిళ్లు లూటీ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లింగయ్య దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరానికి లింగయ్య రూ.10వేలు, రిటైర్డ్ డీఈ గుస్క సత్యనారాయణ రూ.5వేలు, 2002 ఎస్సెస్సీ పెద్దమ్మగడ్డ బ్యాచ్ రూ.5వేల రూపాయలను చైర్మన్ రామగల్ల పరమేశ్వర్, కో చైర్మన్ పూర్మ ఆగంరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.