
హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నీటిలో మునిగిపోయింది. నిన్న(సెప్టెంబర్ 21) అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రైల్వే అండర్ పాస్లో వరద నీరు భారీగా చేరింది. అక్కడ చిన్నపాటి చెరువును తలపిస్తోంది. వరద నీటికి తోడు.. డ్రైనేజీ వాటర్ తో అండర్ పాస్ బ్రిడ్జి మొత్తం జలమయం అయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు నిలిపివేశారు.
ALSO READ : సిటీలో ఇష్టమొచ్చినట్లు తిరిగితే.. ట్రాఫిక్ పన్ను వేస్తారు..?!
గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వచ్చే వాహనాలను గుల్ మోహన్ పార్క్ సిగ్నల్ నుంచి డైవర్ట్ చేశారు పోలీసులు. ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నల్లగండ్లఫ్లై ఓవర్, లింగంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు, బీహెచ్ఈఎల్ సర్కిల్ నుంచి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
నగరంలో చిన్న వాన పడినా రైల్వే స్టేషన్ అండర్ పాస్ బ్రిడ్జి మునిగిపోతుంది. ఇది మునిగిపోకుండా ఉండేలా అధికారులు ప్రత్యామ్యాయ మార్గాలు చూడాలని.. తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరారు.