గింజ కూడా చేతికి రాలే.. కాల్మొక్త సార్ ​మీరే ఆదుకోవాలె

లింగంపేట, వెలుగు: ‘వడగండ్ల వానకు చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది.. గింజ కూడా చేతికి రాలే.. కాల్మొక్త సార్ ​మీరే ఆదుకోవాలె’ అని నిజామాబాద్​ జిల్లా లింగంపేట మాజీ ఎంపీపీ అమ్రియా నాయక్​ కలెక్టర్​ జితేశ్ వి పాటిల్​ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు.

బుధవారం  మండలంలోని లింగంపల్లి సమీపంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట చేలను కలెక్టర్  పరిశీలించారు.  పంటలను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని  అగ్రికల్చర్​ ఆఫీసర్లను  ఆదేశించారు.  కలెక్టర్​ వెంట జిల్లా  ఇన్​చార్జి  అగ్రికల్చర్​ ఆఫీసర్​వీరస్వామి, ఏడీఏ రత్నం, ఏవో అనిల్​కుమార్​,  తహసీల్దార్​ రాజేశ్వర్ రైతులు ఉన్నారు.