లింగంపేట, వెలుగు: లింగంపేట మండలంలోని 11 గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అయిదేండ్లలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు.
గడిచిన 20 ఏండ్లలో జరగని, అభివృద్ధిని అయిదేండ్ల కాలంలోనే చేశానన్నారు. కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టాకే తెలంగాణ అబివృద్ధి చెందిందని, మూడోసారి ఆయన సీఎం అవుతారన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ గరీబున్నీసా, జడ్పీటీసీ ఏలేటి శ్రీలత,ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్ సిద్ధారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు దివిటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.