లింగంపేట, వెలుగు: లింగంపేట మండల పరిషత్‌కు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.30 లక్షల నిధులు మంజూరైనట్లు ఎంపీపీ గరీబున్నీసా తెలిపారు. ఈ నిధులను అభివద్ధి పనులకు ఖర్చు చేయనున్నట్లు ఆమె చెప్పారు.
శెట్పల్లి సంగారెడ్డి, మోతె, శెట్పల్లి గ్రామాల్లో హైమాస్ లైట్ల ఏర్పాటుకు రూ.2లక్షల చొప్పున, శెట్పల్లి సంగారెడ్డి, ఐలాపూర్, భానాపూర్, లింగంపేట గ్రామాల్లో మురికి కాలువల నిర్మాణానికి రూ.2 లక్షల చొప్పున, భవానీపేట, ఎక్కాపల్లి, ముంబాజీపేట, బోనాల్, ముస్తాపూర్లలో తాగునీటి వసతి కోసం ఒక్కో పంచాయతీకి రూ.2లక్షలు, శెట్పల్లి సంగారెడ్డిలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2 లక్షలు, పోతాయిపల్లిలోని మహిళా సంఘం బిల్డింగ్రిపైర్ కురూ.2లక్షలు, ఎమర్జెన్సీ కోసం రూ2.లక్షలు కేటాయించినట్లు ఎంపీపీ చెప్పారు.