హిందూ సంప్రదాయంలో పూజలు, వ్రతాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తమకు ఇష్టమైన దేవుడిని దర్శించుకుని మానసిక శాంతి కోసం ఆలయాలకు వెళ్లడం సర్వసాధారణం. గుడిలో ప్రదక్షిణ చేసి.. ఆలయంలోని పూజారి చేతులమీదుగా దేవుడికి పూజని జారుకుంటాం. తమ తరపున దేవుడికి పూజారులు చేస్తారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. అయితే భువనేశ్వర్ లోని ఓ గుడిలో ఇద్దరు పూజారులు గొడవపడి అన్ని సేవలు బంద్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
పూజలు మావంటే మావన్నారు… మేము ముందు చేస్తామంటే... కాదు మేమే ముందు చేస్తామని గొడవపడ్డారు ఇద్దరు పూజారులు. భువనేశ్వర్ లోని లింగరాజు ఆలయంలో పూజారులు ఆచార వ్యవహారాలపై వాదన పెట్టుకొని దేవుడి గుళ్లో పూజలు చేయడం... నివేదన పెట్టడం మానేశారు.
భువనేశ్వర్ లో 11 వ శతాబ్దానికి చెందిన లింగరాజు ( శివుడి) పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయంలో పైతలగి ( పవిత్రమైన) ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఆచారంలో పవిత్రమైన దారాలను స్వామివారికి సమర్పిస్తారు. ఈ ఆచారం నిర్వహించడంలో ఇరు వర్గాలకు చెందిన పూజారులు గొడవపడ్డారు. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో దేవాలయంలో చేసే అన్ని కైంకర్యాలను ( పూజలను) ఆపేశారు.
ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవంలో పైతలగి ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది సోమవారం ( ఆగస్టు 28) ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని దేవాలయ నిర్వాహకులు నిర్ణయించారు. ప్రతి ఏడాది పూజా పండా సేవకులు శివుడికి మూడు పోగుల పైటలను ( పవిత్ర దారాలను ) సమర్పిస్తారు. ఆ తరువాత బడు నిజోగ్ సేవకులు 24 పవిత్ర దారాలను సమర్పిస్తారు. కాని బడు నిజోగ్ సేవకులు ఈ ఆచారాన్ని మొదట నిర్వహిస్తామని పట్టుబడతారు. దీంతో పూజా పండా సేవకులకు బడు నిజోగ్ సేవకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆలయంలో అన్ని పూజలు చేయడం మానేశారు. కనీసం స్వామివారికి నివేదన కూడా పెట్టడంలేదు. ( వార్త రాసే సమయం వరకు). పూజారుల మధ్య ఏర్పడిన గొడవ ఆచారాలను, సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఉందని లింగరాజు ఆలయ సూపర్‌వైజర్ రాజ్‌కిషోర్ మోహపాత్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెండు గ్రూపుల పూజారులు పూజారులు తమ ఆధీనంలో లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని లింగరాజ్ ఆలయ నిర్వాహకులు తెలిపారు.
లింగరాజు ఆలయానికి భక్తులు మంగళవారం( ఆగస్టు 29) తెల్లవారుజామున స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. అయితే గర్భగుడిలో నిర్వహించాల్సిన పూజలు చేయకపోవడం.. స్వామివారిని అలంకరించకపోవడంతో ... భక్తులు ఎలాంటి పూజలు చేయలేదు. వ్యక్తిగత ఇమేజ్ కోసం శతాబ్దాల చరిత్ర ఉన్న ఆలయ ఆచారాలను నిర్వహించకపోవడం దురదృష్టకరమని భక్తులు వాపోతున్నారు.
తరతరాలుగా ఈ ఆచారం జరుగుతున్నా ... ఇలాంటి గొడవ ఎప్పుడే జరగలేదని మోహ పాత్ర తెలిపారు. లింగరాజ్ ఆలయంలో ఒడిశా రాష్ట్ర దేవాదాయ చట్టాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయ ఆచారాలకు.. సంప్రదాయాలకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే 2019లో పూజారులకు సన్మానం చేసే విషయంలో ఇరు వర్గాల పూజారులు ముందు మాకు చేయాలంటే.. మాకు చేయాలని పట్టుపట్టడంతో ఈ గొడవ కోర్టుకు చేరిందని లింగరాజు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీనిని సామర్యస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పూజారులు అందుకు సిద్దంగా లేరని మోహ పాతర అన్నారు.
దేవుడి దగ్గర సేవలో ఉండే పూజారులు, అర్చకులు ఇలా చేయడం సరికాదంటున్నారు. పూజారులు ఇలా కొడ్డుకోవడం సమాజంలోకి తప్పుడు సంకేతాలు పోతాయంటున్నారు కొందరు భక్తులు. ఇలాంటి గొడవలు తగ్గించి ఒకరినొకరు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.