మే 31లోపు పాన్-ఆధార్‌ లింక్ చేయండి..ఐటీ శాఖ హెచ్చరిక

మే 31లోపు పాన్-ఆధార్‌ లింక్ చేయండి..ఐటీ శాఖ హెచ్చరిక

2024 మే 31 శుక్రవారం లోపు పాన్ కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలంటూ ఐటీ శాఖ ట్వీట్ చేసింది. లేకపోతే అధిక టీడీఎస్ కట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ట్వీట్ లో తెలిపింది. మే 31లోగా పాన్‌ను ఆధార్‌తో నమోదు చేసుకుంటే, స్వల్ప టీడీఎస్ మినహాయింపు కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను శాఖ గత నెల ఏప్రిల్ లోనే ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.  పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయమని ఐటి శాఖ పన్ను చెల్లింపుదారులను కోరడం ఇదే మొదటిసారి కాదు. 

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపుదారుల పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే అటువంటి పరిస్థితిలో డబుల్ టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.  2024ఏప్రిల్ 24 న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, పాన్ డియాక్టివేట్ చేయబడిన చాలా మంది పన్ను చెల్లింపుదారులు టీడీఎస్ తగ్గింపులో డిఫాల్ట్ నోటీసులు అందుకున్నారు.. దీనికి పాన్‌ నిరుపయోగంగా మారడమే కారణమని వెల్లడించింది. 

పాన్‌ కార్డు ఉన్నవారు ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఆధార్‌ నంబర్‌తో లింక్  చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు రూ. 1000 ఫైన్ తో లింక్ చేయాల్సి ఉంటుంది. 


పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ఎలా?

1. ఆదాయపు పన్ను ఈ–-ఫైలింగ్ పోర్టల్‌‌‌‌‌‌‌‌కి వెళ్లండి.-- https://www.income tax.gov.in/iec/foportal/ లింక్​పై క్లిక్ చేయండి
2. హోమ్‌‌‌‌‌‌‌‌పేజీలో, క్విక్ లింక్‌‌‌‌‌‌‌‌లను ఎంచుకుని, ఆపై ఆధార్ స్టేటస్​ను చెక్ చేయండి
3. ఇప్పుడు  పాన్,  ఆధార్ నంబర్‌‌‌‌‌‌‌‌లను నమోదు చేయాల్సిన రెండు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లు కనిపిస్తాయి
4. దీని తరువాత, ఒక పాప్-అప్ మెసేజ్ వస్తుంది. ఆధార్  పాన్ లింక్ అయి ఉంటే ‘‘మీ పాన్​కార్డుతో ఆధార్‌‌‌‌‌‌‌‌ లింకింగ్ పూర్తయింది” అని మెసేజ్ కనిపిస్తుంది
5. మీ పాన్  ఆధార్ లింక్ చేయకుంటే,  స్క్రీన్‌‌‌‌‌‌‌‌పై మెసేజ్ వస్తుంది. - పాన్ ఆధార్‌‌‌‌‌‌‌‌తో లింక్ కాలేదని, ఈ పనిని పూర్తి చేయడానికి దయచేసి '‘లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి”అనే రిక్వెస్ట్ 
కనిపిస్తుంది
6. అన్ని వివరాలు ఇచ్చాక ‘‘మీ ఆధార్-పాన్ లింకింగ్ రిక్వెస్ట్ వెరిఫికేషన్ కోసం యూఐడీఏఐకి వెళ్లింది. హోమ్ పేజీలోని 'లింక్ ఆధార్ స్టేటస్' లింక్‌‌‌‌‌‌‌‌పై క్లిక్ చేసి స్టేటస్ను తెలుసుకోండి”అంటూ మెసేజ్ వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా స్టేటస్​ను చెక్ చేయడానికి 567678 లేదా 56161కు మెసేజ్ పంపాలి. లింకింగ్ పూర్తయితే ... అయిందనీ.. లేకుంటే కాలేదనీ రిప్లై వస్తుంది.