లింక్డిన్ కూడా గేమింగ్‌లోకి ఎంటర్ అయిపోయింది. పిన్‌పాయింట్, క్వీన్స్, క్రాస్ క్లయింబ్ పేరుతో మూడు గేమ్స్ తెచ్చింది. మొబైల్ యాప్, వెబ్సైట్లోనూ వీటిని ఆడేయొచ్చు. ఈ గేమ్స్ ‘మై నెట్వర్క్’ ట్యాబ్‌లో చూడొచ్చు. డెస్క్‌టాప్‌లో న్యూస్ సెక్షన్‌లోనూ అందుబాటులో ఉంటాయి. వర్డ్లీ వంటి గేమ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. లింక్డిన్ కూడా అలాంటి గేమ్స్ తీసుకొచ్చింది.
దీన్ని న్యూస్ డిపార్ట్మెంట్కి చెందిన గేమ్స్ ఎడిటర్ పావోలో పాస్కో డిజైన్ చేశాడు. అంతకుముందు ఇతను అమెరికన్ వ్యాల్యూస్ క్లబ్ క్రాస్‌వర్డ్ పేరుతో వచ్చే వీక్లీ క్రాస్వర్డ్లో పనిచేశాడు. ఈ ఏడాది అమెరికన్ క్రాస్‌వర్డ్ పజిల్ టోర్నమెంట్ విన్నర్ కూడా. అయితే, ఇతను తయారుచేసిన ఈ మూడు గేమ్స్ రోజుకు ఒకసారి ఆడొచ్చు. ఆడాలనుకున్న వాళ్ల కాంటాక్ట్‌లో ఎవరెవరు? ఏ ఆటను? ఆడారో కూడా తెలుసుకోవచ్చు. స్కూల్, కంపెనీ నెట్‌వర్క్స్‌లో ఎవరు బాగా ఆడారో కూడా లీడర్ బోర్డ్ రూపంలో కనిపిస్తుంది.