గంజాయి అక్రమ రవాణా లింక్ లను బ్రేక్ చేయాలి : ఏవీ. రంగనాథ్

ఖమ్మం టౌన్, వెలుగు: గంజాయి అక్రమ రవాణా లింక్​లను బ్రేక్ చేయాలని మల్టీజోన్–1 ఐజీపీ ఏవి. రంగనాథ్ వెల్లడించారు. సోమవారం గంజాయి నియంత్రణపై ఆయన వివిధ జిల్లాల పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గంజాయి రవాణా, విక్రయాల నిర్మూలనకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఇందుకోసం అవసరమైన  ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో  2021 ఏడాదిలో 170 కేజీల గంజాయి పట్టుబడిన కేసులో నలుగురు నిందితులుకు 20 ఏళ్ల  జైలు శిక్ష, జరిమానా పడేలా చేసిన పోలీసులను ఐజీపీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు, నరేశ్​ కుమార్, ఏసీపీలు రమణమూర్తి, బోజరాజు, మల్లయ్య, సీఐలు పాల్గొన్నారు.