Lion Tug of War: అడవికి రారాజు సింహం.. అడవి జంతువుల్లో బలమైనది, తెలివైనది అని అంటుంటారు. అంతటి శక్తి శాలి అయిన సింహంతో మనుషులు పోటీ పడితే ఎలా ఉంటుంది.. అది ఆటలో.. సింహానికి మనుషులకు ఆట పోటీ ఏందీ అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే.. ఒకవైపు సింహం మరోవైపు మనుషులు.. తాడు నోట కరుచుకొని సింహం.. ఇవతలి వైపు మనుషులు.. ఊహించడానికే వింతగా ఉంది కదా.. నిజంగానే సింహం, మనుషులు తాగులాగుడు ఆట ఆడారు. ఎక్కడ,ఎలా, ఎందుకు ఈ ఆటలో ఎవరు గెలిచారు తెలుసుకుందాం రండి..
సింహం, మనుషులు తాడు లాగుడు అటలో పోటీపడుతున్న సీన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వైపు సింహం తాడును నోట కరుచుకుని ఉంది.. మరో వైపు ముగ్గురు బలమైన బాడీ బిల్డర్లు తాడును పట్టుకుని ఉన్నారు. మధ్యన రిఫరీ స్టార్ట్ అనగానే పోటీ ప్రారంభమయింది. మధ్యన సక్సెస్ లైన్ గా ఓ కంచె ఉంది. కంచెదాటి సింహం ఇటువైపు వస్తుందా.. లేక మనుషులే అటువైపు వెళతారా అని అక్కడున్న చిన్నా పెద్దా అందరూ ఈ ఆటను ఉత్కంఠగా చూస్తున్నారు.
ఉత్కంఠగా సాగిన ఈ ఆటలో అంత బలశాలులు అయిన ముగ్గురు బాడీ బిల్డర్లు.. సింహం ముందు తలవంచక తప్పలేదు.. సింహాన్ని నిల్చు స్థానం నుంచి ఒక్క అడుగు కూడా కదిలించ లేక పోయారు.. చివరికి మేం ఓడిపోయాం అని చేతులెత్తాశారు బాడీబిల్డర్లు.. ఎక్కడ జరిగిందో స్పష్టం గా తెలియదు కానీ.. ఈ ఆట ఓ జూలో మాత్రం జరిగినట్లు కొట్టొచ్చినట్లు కనపడు తోంది.. జూకు వచ్చిన చిన్నా పెద్దా.. ఈ సింహం, మనుషుల గేమ్ చూసి చాలా ఎంజాయ్ చేశారు. సింహమా మజాకా..
The power of the Lioness 🦁 pic.twitter.com/RZDIzX6nb9
— Riya kumari (@Riya76971197) July 24, 2024