నల్గొండ​లో ఘనంగా లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు 

నల్గొండ​లో ఘనంగా లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు 

నల్గొండ అర్బన్, వెలుగు : పట్టణంలోని జెల్ గార్డెన్​లో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఏర్పాటు చేసి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్​జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెరుమల సునీల్ కుమార్ హాజరై చార్టర్డ్ సభ్యులు భీమయ్య, కోటేశ్వర్ రావు, అమరేందర్ రావు, వెంకటపతిని ఘనంగా సన్మానించారు. అనంతరం క్లబ్ సావనీర్ ను ఆవిష్కరించారు.

లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆధ్వర్యంలో నూతనంగా రెండు క్లబ్ లను ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల,  హాలియా క్లబ్ లను ప్రారంభించారు. వేడుకల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు డాక్టర్ కడిమి హరినాథ్, నాయకులు పాల్గొన్నారు.