కేజ్రీవాల్​పై దాడికి యత్నం..పాదయాత్ర చేస్తుండగా ఘటన

కేజ్రీవాల్​పై దాడికి యత్నం..పాదయాత్ర చేస్తుండగా ఘటన

న్యూఢిల్లీ, వెలుగు : ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​పై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. ఏదో లిక్విడ్​ను ఆయనపై జల్లి భయబ్రాంతులకు గురిచేశాడు. శనివారం   సౌత్​ ఢిల్లీలోని మాలవీయ నగర్​లో కేజ్రీవాల్ పాదయాత్ర నిర్వహించారు. తన మద్దతుదారులతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి దూసుకొచ్చి కేజ్రీవాల్​పై లిక్విడ్​ చల్లాడు. 

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అతడిని అశోక్​ ఝాగా గుర్తించిన పోలీసులు స్థానిక పోలీస్​ స్టేషన్ కు తీసుకెళ్లి, విచారణ చేపట్టారు.