భద్రాచలంలో 9,10 న మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం: కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

భద్రాచలంలో  9,10 న  మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం: కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​
  • ఏరు ఫెస్టిఫల్​కు పక్కాగా  ఏర్పాట్లు చేయాలి:కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ 

భద్రాచలం,వెలుగు : ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన  ఏర్పాట్లు చేయాలని, ఏరు ఫెస్టివల్​ను విజయవంతం చేయాలని కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ పిలుపునిచ్చారు. సబ్​ కలెక్టర్​ ఆఫీసులో సోమవారం ఆయన ముక్కోటి ఏర్పాట్లపై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన  మాట్లాడుతూ... వీవీఐపీ, వీఐపీలకు వేర్వేరుగా బారికేడ్లతో పాటు ఆ సెక్టార్లలో అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. టౌన్​లో శానిటేషన్​ పక్కాగా ఉండాలని ఎక్కడా భక్తులు అసౌకర్యానికి గురికాకూడదన్నారు.   20 చోట్ల మంచినీరు ఏర్పాటు చేయాలన్నారు.  ఇప్పుడున్న 138 టాయిలెట్లతో పాటు మొబైల్​ టాయిలెట్లను కూడా తెప్పించాలని, 8,9,10 తేదీల్లో మెయిన్​ ఫెస్టివల్ ఉన్నందున  ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.

 9,10 న  భద్రాచలంలో  మద్యం, మాంసం అమ్మకాలను నిషేధించినట్లు వెల్లడించారు. బస్సులను భక్తులకనుగుణంగా నడపాలని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించారు.  గోదావరి కరకట్ట కింద ఏర్పాటు చేసిన గుడారాలలో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఇక్కడ నుంచి కిన్నెరసాని, బొజ్జిగుప్ప, బెండాలపాడు, ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్​ మ్యూజియం సందర్శించేలా ఆఫీసర్లు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్​, ఎస్పీలు ఉత్తరద్వారం, మిథిలాస్టేడియం, తెప్పోత్సవం, పార్కింగ్​ ప్రదేశాలను తనిఖీ చేశారు.