వ్యాపారస్తులు బిజినెస్ ను పెంచుకొనేందుకు.. కష్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక ట్రిక్కులను ఉపయోగిస్తారు. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. గిప్ట్ కూపన్స్.. డిస్కౌంట్ ఆఫర్స్.. లాటరీ ద్వారా బహుమతులు ఇలా ఒకటేమిటి అనేకమైనవి వింటున్నాం.. చూస్తున్నాం. అయితే తాజాగా ఇప్పుడు ఓ మద్యం వ్యాపారి ఆ షాపులో చుక్క తాగకుండానే కిక్కు ఎక్కే ఆఫర్ప్రకటించాడు.
కాకినాడకు చెందిన ఓ లిక్కర్ షాపు యజమాని మందు తాగండి .. థాయ్‌లాండ్ వెళ్లండి అంటూ పోటీలు ఏర్పాటు చేశాడు. తన దుకాణంలో అన్నిరకాల బ్రాండ్లు దొరుకుతాయంటూ.. మద్యం కొన్న వారికి టోకెన్లు ఇస్తామని ప్రకటించారు. కావలసిన బ్రాండ్ ను ఫుల్లుగా తాగడమే కాదు ఫ్రీగా.. థాయ్‌లాండ్ వెళ్లే అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ ప్రకటించాడు.
ALSO READ | తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..
మద్యం ప్రియులు తమ షాపులో బాటిల్ కొంటే.. టోకెన్ ఇస్తామని... లాటరీ లో గెలుపొందిన వారికి కారు, బైక్, సెల్‌ఫోన్ వంటి గిఫ్ట్‌లను రూ. 1.5 లక్షల విలువైన బహుమతులు ఉన్నాయి. అంతే కాదు లాటరీ లో మొదటి బహుమతి గెలుపొందిన వారు ఏకంగా థాయ్‌లాండ్ వెళ్లొచ్చు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ప్రకటన చూసిన మందుబాబులు కాకినాడలోని ఆషాపునకు క్యూ కట్టారు. మరి థాయ్లాండ్ఫ్రీ టూర్ అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి.