ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని మంగళవారం ( ఆగస్టు 27) మరోసారి పొడిగించింది రాస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యూడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 3 వరకు పొడిగించింది ఢిల్లీ రాస్ అవెన్యూ కోర్టు. కేజ్రీవాల్ తోపాటు మరో ఐదుగురిని నిందితులగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసి న నాల్గో అనుబంధ ఛార్జీషీట్ పైన కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ లో ఉచింది. దీనిపై సెప్టెంబర్ 3న విచారణ జరగనుంది.
మరోవైపు ఇదే కేసులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత బెయిల్ ఇస్తూ.. ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యి.. తీహార్ జైలులో ఉన్నారు కవిత. 2024, మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ, సీబీఐ విచారణ నడుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ, సీబీఐ విచారణ నడుస్తుంది. ఈ రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో గంటన్నరపాటు వాదనలు సాగాయి. సెక్షన్ 45 కవితకు ఎందుకు వర్తించదు అని కవిత తరపు లాయర్లు వాదించారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను ఈడీ సమర్పించలేదని.. 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు చెబుతున్న ఈడీ.. ఒక్క రూపాయి కూడా రికవరీ ఎందుకు చేయలేదని వాదించారు. కవితకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ తప్పితే.. ఎలాంటి ఆధారాలు లేవన్నారు ఆమె తరపు వాదించిన ప్రముఖ లాయర్ ముకుల్ రోహిత్గీ.