
మద్యం ప్రియులకు, ట్యాక్స్ పేయర్లకు షాకింగ్ న్యూస్. అతి త్వరలోనే.. రాబోయే ఫిబ్రవరి నెలలోనే తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. మద్యం ధరలు పెంచాలంటూ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం.. 2025, ఫిబ్రవరి నెల నుంచి మద్యం ధరలను పెంచాలనేది ఎక్సైజ్ శాఖ ప్రతిపాదన. బ్రాండెడ్ బీర్లు, బ్రాండెడ్ మద్యం, చీప్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నది.
హైదరాబాద్: తెలంగాణలో మద్యం ప్రియులకు కిక్కు దిగే వార్త ఇది. మద్యం ధరల పెంపుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి మద్యం ధరలను పెంచాలనే నిర్ణయానికొచ్చినట్లు సమాచారం.
సచివాలయంలో గత నాలుగైదు రోజులుగా ఎక్సైజ్ అధికారుల సమావేశమై ఈ అంశంపై చర్చించారు. వచ్చే నెల నుంచి అంటే ఫిబ్రవరి 1 నుంచి మద్యం ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రీమియం బ్రాండ్స్ అండ్ బీర్లపై 15% మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ డిసైడ్ అయినట్లు సమాచారం.