మనదేశంలో గోవా టాప్ టూరిస్ట్ ప్లేస్ . దేశవిదేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి బీచ్ లో చల్లగా బీరు తాగుతూ చీల్ అవుతూ ఉంటారు. గోవాలో మందు చాలా చీప్ గా దొరుకుతుందన్న సంగతి అందరికీ తెలుసు. ఎంత చీప్ గా అనేది ఈ లెక్కలు చూస్తే మీకే అర్థం అవుతుంది.
గోవాలో రూ. 100 ఖరీదు చేసే స్పిరిట్ బాటిల్ దేశ రాజధాని ఢిల్లీలో 62 శాతం టాక్స్ తో రూ. 134కి అమ్ముడువుతుంది. ఇక కర్ణాటకలో 83శాతం టాక్స్ తో రూ. 513, తెలంగాణలో 68 శాతం టాక్స్ తో రూ. 246, మహారాష్ట్రలో 71శాతం టాక్స్ తో రూ. 226, రాజస్థాన్ లో 66 శాతం టాక్స్ తో రూ. 213, ఉత్తరప్రదేశ్ లో 66 శాతం టాక్స్ తో రూ. 197, హరియాణలో 47 శాతం టాక్స్ తో రూ. 147గా ఆమ్ముడువుతుంది.