Good News: మద్యం ప్రియులకు పండగే.. ఏపీలో భారీగా తగ్గనున్న ధరలు..

Good News: మద్యం ప్రియులకు పండగే.. ఏపీలో భారీగా తగ్గనున్న ధరలు..

వైసీపీ హయాంలో కోరుకున్న బ్రాండ్లు దొరకక, ధరలు అందుబాటులో లేక.. సతమతమైన మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం వచ్చాక మంచి రోజులు వచ్చాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంచి బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చింది. అయితే.. అనుకున్న రేంజ్ లో ధరలు తగ్గకపోవడంతో మద్యం ప్రియుల్లో ఒకింత నిరాశ అయితే ఉందనే చెప్పాలి. అయితే.. ఇప్పుడు మద్యం ప్రియులకు పండగ లాంటి వార్త వినిపిస్తోంది.. ఏపీలో దాదాపు 11 కంపెనీలు మద్యం ధరలు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. 

Also Read :- ఏపీలోని ప్రకాశం జిల్లా భూ ప్రకంపనలు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బేస్ ప్రైస్ ను భారీగా పెంచేసిన కంపెనీల్లో కొన్ని ఇప్పుడు వాటంతట అవే తగ్గించుకున్నాయని సమాచారం. కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చి మద్యం ప్రియుల డిమాండుకు అనుగుణంగా, పారదర్శకంగా ఆర్డర్లు ఇస్తున్న క్రమంలో 11 కంపెనీలు వాటి బేసిక్ ప్రైస్ తగ్గించుకున్నాయని తెలుస్తోంది. ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ఎమ్మార్పీపై రూ.30 వరకూ తగ్గనున్నట్లు తెలుస్తోంది.