త్వరలో మద్యం ధరల పెంపు !

త్వరలో మద్యం ధరల పెంపు !

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పెంపు ధరలను తొందర్లోనే  అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. మద్యం ధరలను పెంచాలని ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది.

 ఇందులో మద్యం ధరలు ఎంత మేరకు పెంచే అవకాశం ఉందో పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు మద్యం ధరలపై త్రిసభ్య కమిటీ రిపోర్టును అధికారులు పరిశీలిస్తున్నారు. మద్యం ధరలను దాదాపు 10 శాతం నుంచి15 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది. బ్రాండెడ్ బీర్లు, బ్రాండెడ్ మద్యం, చీప్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నది.