దేశ వ్యాప్తంగా కొత్త మద్యం పాలసీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను ఫాలో అవుతున్న రాష్ట్రాల్లో ఈ పాలసీ అమల్లోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాలు మాత్రం సొంత లిక్కర్ పాలసీలను అమలు చేసుకుంటున్నాయి. 2024, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లిక్కర్ లైసెన్స్ ధరలను 10 శాతం పెరిగింది.. అంతే కాదు బీరు, హాట్ లిక్కర్ ధరలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉత్తరప్రదేశ్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి లిక్కర్ ధరలు పెరిగాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే దేశంలో తయారయ్యే మద్యం ధరను కనీసం ఐదు రూపాయలు పెంచింది. ప్రస్తుతం 65 రూపాయలు ఉన్న బాటిల్ ఇప్పుడు 75 రూపాయలు అయ్యింది. యూపీలో తయ్యారయ్యే పవ్వా రకం లిక్కర్ బాటిల్ ధరను ఏకంగా 15 రూపాయలు పెంచింది. ఇప్పటి వరకు 75 రూపాయలుగా ఉన్న బాటిల్ ధర.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 90 రూపాయలు అయ్యింది. ఇక విదేశీ మద్యం ధరలు 15 నుంచి 25 రూపాయల వరకు పెరిగాయి. హాఫ్, ఫుల్ బాటిల్ ధరలు అమాంతం పెరిగాయి. ఇక బీరు బాటిల్ పై 10 రూపాయలు పెంచింది అక్కడి బీజేపీ సర్కార్..
ఇక చత్తీస్ ఘడ్ విషయానికి వస్తే మందు ప్రియులకు షాక్. కనీసం 10 నుంచి గరిష్ఠంగా 40 రూపాయల వరకు లిక్కర్ ధరలు పెంచింది అక్కడి బీజేపీ సర్కార్. దేశంలో తయారయ్యే మద్యం బాటిల్ ధరను 10 రూపాయలు పెంచగానే.. విదేవీ మద్యం ధరలను 40 రూపాయలు పెంచింది. పెంచిన ధరలతో 11 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేస్తుంది చత్తీస్ ఘడ్ బీజేపీ సర్కార్.
ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే.. మద్యం ధరలను 150 నుంచి 200 రూపాయల వరకు పెంచింది. కనీస ధరను 15 శాతం పెంచింది మధ్యప్రదేశ్ బీజేపీ సీఎం మోహన్ యాదవ్ సర్కార్. 15 వేల కోట్ల అదనపు ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. ఒక్క భోపాల్ సిటీ టార్గెట్ గా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను లిక్కర్ అమ్మకాల ద్వారా రాబట్టుకోవాలనే లక్ష్యంగా మధ్యప్రదేశ్ సర్కార్ అంచనా వేసింది.
మద్యం ధరలను భారీగా పెంచిన మూడు రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కావటం విశేషం. ఎన్నికల ముందు.. పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో మందు ప్రియులను టార్గెట్ చేయటం చర్చనీయాంశం అయ్యింది.