ఫేక్​ ఫోన్​పే యాప్​తో రూ.లక్ష లిక్కర్ కొనుగోలు..చేవెళ్ల, శంకర్​పల్లిలోని వైన్​షాపులే టార్గెట్

ఫేక్​ ఫోన్​పే యాప్​తో రూ.లక్ష లిక్కర్ కొనుగోలు..చేవెళ్ల, శంకర్​పల్లిలోని వైన్​షాపులే టార్గెట్

చేవెళ్ల, వెలుగు : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్​పల్లిలోని వైన్​షాపులను కేటుగాళ్లు టార్గెట్​చేశారు. ఫేక్​ఫోన్​పే యాప్​తో లిక్కర్​బాటిళ్లను కొట్టేస్తున్నారు. తాజాగా లావాదేవీల్లో తేడా రావడంతో చేవెళ్లలోని దుర్గా వైన్స్ మేనేజర్ నిఘా పెట్టారు. సీసీ కెమెరాలను చెక్ చేయగా ఏడుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వైన్స్ కౌంటర్ బిజీగా ఉన్న సమయంలో ఫేక్​ఫోన్​పే యాప్ ద్వారా లిక్కర్​కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించి నిందితులను పోలీసులకు అప్పగించారు.

వారిలోని ఓ వ్యక్తి చేవెళ్ల, శంకర్​పల్లి పరిధిలో వైన్​షాపుల్లో ఫేక్ ఫోన్​పే యాప్​ద్వారా లిక్కర్​కొన్నట్లు ఒప్పుకున్నాడు. అమౌంట్​క్రెడిట్ అయినట్లు యూపీఐ స్పీకర్ లో వచ్చేలా ఈ ఫేక్​యాప్​పనిచేస్తుంది. అతను చేవెళ్లకు చెందిన ఇంటర్​విద్యార్థికి ఫేక్​యాప్​లింక్​పంపినట్లు తెలిసింది.

కేటుగాళ్ల చైన్​లింక్​ను పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఫేక్​యాప్​ఉపయోగించి కేటుగాళ్లు చేవెళ్ల, శంకర్​పల్లిలోని వైన్​షాపుల్లో దాదాపు రూ.లక్ష లిక్కర్​కొట్టేసినట్లు సమాచారం.