ఏపీలో అద్భుతం : సంతలో మద్యం అమ్మకాలు.. టేబుల్స్ వేసి కూరగాయలు అమ్మినట్లు..!

ఏపీలో అద్భుతం : సంతలో మద్యం అమ్మకాలు.. టేబుల్స్ వేసి కూరగాయలు అమ్మినట్లు..!

లిక్కర్ షాపు అంటే ఇలా ఉంటుందా.. ఇలా కూడా అమ్ముతారా అని నిరూపించింది ఏపీ రాష్ట్రం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ వ్యక్తులకే కాంట్రాక్ట్ కింద మద్యం షాపులు కేటాయించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏపీలో లిక్కర్ షాపులతోపాటు బెల్ట్ షాపులు, గల్లీగల్లీలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీనికి నిదర్శనమే ఈ వీడియో..

 

ఏపీ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆదివారం సంత జరుగుతుంది. ఈ సంతలో.. రోడ్డు పక్కన.. ఇళ్ల బయట మద్యం బాటిళ్లు ప్రత్యక్షం అయ్యాయి. మీరు షాపుల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు.. మీ ఇంటి దగ్గరకే మద్యం వచ్చేసింది అన్నట్లు.. ఇంటి ముందు బల్లలు వేసి.. లిక్కర్ బాటిళ్లు డిస్ ప్లే చేస్తూ.. యధేచ్ఛగా అమ్మేస్తున్నారు.

ఈ ఘటన చూసి సంతకు వచ్చిన మహిళలు అవాక్కయ్యారు. సంతలో కూరగాయలు అమ్ముతారని తెలుసు.. చిన్న చిన్న వస్తువులు అమ్ముతారని తెలుసు.. ఇలా మద్య కూడా అమ్ముతారా అంటూ చర్చించుకోవటం జరిగింది. ఏదిఏమైనా నాణ్యమైన మద్యం.. సరసమైన ధరకు.. ఇంటింటికీ అంటే మాటలు ఏంటీ చెప్పండీ.. ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.