- గతేడాది జనవరి కంటే ఈసారి రూ. 490 కోట్లు ఎక్కువ ఇన్‌కం
- 2020–21లో సర్కారుకు రూ.22,380 కోట్ల ఆదాయం
హైదరాబాద్, వెలుగు: జనవరి నెలలో రాష్ట్రంలో రూ. 2,633 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. 32 లక్షల కేసుల ఐఎంఎల్(ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్), 27 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గ్రేటర్ పరిధిలోనే ఎక్కువగా సేల్స్ జరిగాయి. రంగారెడ్డి–1, 2 డిపోల పరిధిలో రూ.350 కోట్లు, మేడ్చల్ –1,2 డిపోల పరిధిలో రూ.294 కోట్లు, వరంగల్ అర్బన్, రూరల్ డిపోల్లో రూ.281 కోట్లు, నల్గొండ డిపోలో రూ.241 కోట్ల చొప్పున లిక్కర్ అమ్ముడైంది. గతేడాది జనవరిలో రూ. 2,143 కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా.. ఈ జనవరిలో రూ. 490 కోట్లు అదనంగా.. మొత్తం రూ. 2,633 కోట్ల ఆదాయం సమకూరింది.
2020-21లో 22,380 కోట్ల ఇన్‌కం..
2020 మార్చి 22 నుంచి సుమారు రెండు నెలలపాటు వైన్ షాపులు బంద్ కావడంతో ఖజానాకు రూ.4 వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం లిక్కర్‌పై20 శాతం వరకు రేట్లు పెంచడంతో సర్కారుకు మస్తు ఆదాయం సమకూరుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆబ్కారీ శాఖ ద్వారా సర్కారుకు రూ. 22,380 కోట్ల ఆదాయం వచ్చింది. 2019–20లో రూ.17,010 కోట్ల మద్యం విక్రయించారు. 2020–21లో మాత్రం రూ. 5,370 కోట్ల ఆదాయం అదనంగా వచ్చింది. డిసెంబర్‌లో ఆల్ టైం రికార్డుగా రూ. 2,764 కోట్ల ఇన్ కం వచ్చింది.
For More News..