
నిర్మల్ జిల్లాలో మద్యం ఏరులైపారుతోంది. విచ్చలవిడిగా బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు. కిరాణా షాపుల్లో సరుకులతో పాటు జోరుగా మద్యం అమ్ముతున్నారు.
మార్చి 28న రాణాపూర్ లో కిరాణ దుకాణంలో మద్యం అమ్మకాలు జరుపుతుండగా ఎఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 73 వేల మద్యాన్ని సీజ్ చేశారు . కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా మద్యం అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ALSO READ :కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు 156 వడ్ల కొనుగోలు సెంటర్లు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
రాష్ట్రంలో బెల్టు షాపులను ప్రోత్సహించే ప్రసక్తి లేదని ఇటీవలే అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు.గత బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా బెల్టు షాపులకు పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. బెల్టు షాపుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.