బార్ లైసెన్స్ ఇప్పిస్తానని రూ.కోటి కొట్టేశాడు.. ఇద్దరిని మోసం చేసిన వ్యక్తిపై కేసు

 బార్ లైసెన్స్ ఇప్పిస్తానని రూ.కోటి కొట్టేశాడు.. ఇద్దరిని మోసం చేసిన వ్యక్తిపై కేసు

గచ్చిబౌలి, వెలుగు: బార్ లైసెన్స్ ఇప్పిస్తానని ఓ వ్యక్తి రూ.కోటి కొట్టేశాడు. కోకాపేటకు చెందిన నాగార్జున, కొంపల్లికి చెందిన ధర్మారెడ్డి కలిసి రాయదుర్గంలో బార్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాకు చెందిన వెంకట పవన్ వారికి పరిచయమయ్యాడు. బీఫార్మసీ పూర్తి చేసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంటున్న నిందితుడు.. తనకు ప్రభుత్వంలో పెద్దపెద్ద నాయకులు, అధికారులు తెలుసని, బార్​ లైసెన్స్ ఈజీగా ఇప్పిస్తానని నమ్మించాడు. గత ఆగస్టు నుంచి పలు దఫాలుగా ఇద్దరి నుంచి రూ.కోటి తీసుకున్నాడు.

 ఆ తర్వాత దరఖాస్తు ప్రాసెస్ లో ఉందని మాయమాటలు చెప్పాడు. నెలలు గడుస్తున్నా లైసెన్సు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు నాంపల్లిలోని ఎక్సైజ్ ఆఫీస్​లో ఎంక్వైరీ చేయగా, ఎటువంటి దరఖాస్తు పెండింగ్​లో లేదని తెలుసుకొని కంగుతున్నారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.