
గచ్చిబౌలి, వెలుగు: గ్రాడ్యుయేట్, టీచర్ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మూడు రోజులపాటు లిక్కర్షాపులు క్లోజ్చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్మహంతి తెలిపారు. 27న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్గ్రాడ్యుయేట్, టీచర్ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.
కొల్లూరు, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లు మెదక్ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైన్స్, బార్అండ్రెస్టారెంట్లు, స్టార్హోటల్స్లోని బార్లను ఈ నెల 25 సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదిన సాయంత్రం 4 గంటలకు క్లోజ్చేయాలని స్పష్టం చేశారు.