కల్లు డిపోలు, దుకాణాలపై దాడులు

కల్లు డిపోలు, దుకాణాలపై దాడులు
  • నలుగురు అరెస్ట్, పరారీలో ఐదుగురు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటలో కల్లు డిపోలు, దుకాణాలపై దాడులు నిర్వహించి 13 గ్రాముల ఆల్ప్రాజోలం, 1118 కల్తీకల్లు సీసాలు, 800 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.  సిద్దిపేట పట్టణంతో పాటు, పరిసర ప్రాంతాల్లోని కల్లు డిపోలలో, దుకాణాలలో కొంతమంది అల్ఫ్రాజోలమ్ ను కలిపి కల్లు విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిందన్నారు. 

యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీలు ఉపేందర్, పుష్పం కుమార్, సోమనాథం, ఏసీపీ మధు, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్ సిబ్బందితో కలిసి సిద్దిపేట పట్టణం భరత్ నగర్, ఇందిరమ్మ కాలనీ, పటేల్ పుర,  రంగధాంపల్లిలో ఉన్న కల్లు దుకాణాలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తనిఖీల్లో 13 గ్రాముల అల్ఫ్రాజోలం, 8వందల లీటర్ల కల్తీ కల్లును అధికారులు గుర్తించారు. 

ఈ మేరకు పల్లె రాములు, అంబటి రాజు, పల్లె అంజయ్య గౌడ్, బొడిగే శ్రీనివాస్ గౌడ్ ను అదుపులో తీసుకోగా గాదగోని ప్రకాశ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పల్లె అనిల్, ముండ్రాయి రాజు, గడ్డమీది రాజా గౌడ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.