యాదాద్రి, వెలుగు : ఈనెల 25 నుంచి యాదాద్రి జిల్లాలో మద్యం దుకాణాలను మూసి వేయాలని కలెక్టర్హనుమంతు జెండగే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈనెల 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 25 సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 వరకు జిల్లాలోని వైన్స్, బార్లు, కల్లు దుకాణాలను మూసి వేయాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఎల్లంఘిస్తే ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.